సోమవారం 13 జూలై 2020
National - Jun 03, 2020 , 01:59:25

భారత్‌ భూభాగంలోకి చైనా సైన్యం

భారత్‌ భూభాగంలోకి చైనా సైన్యం

  • రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: లడఖ్‌లోని తూర్పు ప్రాంతంలో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను దాటి చైనా బలగాలు ‘గణనీయ సంఖ్య’లోనే మన భూభాగంలోకి చొచ్చుకొచ్చాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సిం  మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తత సరిదిద్దడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంగళవారం తెలిపారు. ఇరు దేశాల మిలిటరీ అధికారులు ఈ నెల 6న భేటీ కానున్నారని, భారత్‌ తన స్థానం నుంచి వెనుకకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లడఖ్‌లోని తూర్పు ప్రాంతాలు తమవని చైనా వాదిస్తున్నదని, భారత్‌ కూడా ఈ భాగం తమదేనని నమ్ముతున్నదన్నారు. ఈ క్రమంలో భారత్‌ చేయాల్సింది చేస్తుందని చెప్పారు. 


logo