మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 10:58:26

గాల్వ‌న్ దాడి.. సైనికుల మృతిపై చైనా లెక్క ఇది !

గాల్వ‌న్ దాడి.. సైనికుల మృతిపై చైనా లెక్క ఇది !

హైద‌రాబాద్: ల‌డాఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో జూన్ 15వ తేదీన భార‌త‌, చైనా సైనిక ద‌ళాల మ‌ధ్య భీక‌ర ఘ‌ర్ష‌ణ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర మ‌ర‌ణం పొందారు. అయితే ఆ దాడిలో చైనా మాత్రం ఎంత మంది సైనికులు చ‌నిపోయారో చెప్ప‌లేదు. తాజాగా రెండు దేశాల మ‌ధ్య మాల్డోలో జ‌రిగిన సైనిక చ‌ర్చ‌ల్లో గాల్వ‌న్ దాడి మృతుల సంఖ్య‌ను చైనా వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ‌లో పీఎల్ఏకు చెందిన అయిదు మంది సైనికులు మృతిచెందిన‌ట్లు చైనా పేర్కొన్న‌ది. ఈ విష‌యాన్ని ఆ స‌మావేశంలో పాల్గొన్న భార‌తీయ వ‌ర్గాలకు చైనా చెప్పిన‌ట్లు తెలుస్తోంది. గాల్వ‌న్ మృతుల వివరాల‌ను చైనా తొలిసారి వెల్ల‌డించింది. చైనా చెప్పిన మృతుల వివ‌రాల విష‌యంలో భార‌త ప్ర‌భుత్వ వ‌ర్గాలు మాత్రం మ‌రోలా స్పందించాయి.  చైనా అయిదు చెప్పిదంటే, దానికి మూడింత‌లు వేసుకోవాల‌ని భార‌తీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.    


logo