ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 09:21:14

న‌వ్వు తెప్పించే.. చిన్నారి మిర్ర‌ర్ గేమ్‌!

న‌వ్వు తెప్పించే.. చిన్నారి మిర్ర‌ర్ గేమ్‌!

కొన్నిసార్లు పెద్ద‌లు ఏం చేసినా చిన్న‌పిల్ల‌ల్ని న‌వ్వించ‌లేరు. కానీ, పిల్ల‌లు మాత్రం క్ష‌ణాల్లో ఇట్టే న‌వ్వు తెప్పించేయ‌గ‌ల‌రు. 54 సెకండ్ల పాటు న‌డిచే ఈ వీడియో చూస్తే ఎవ‌రికైనా న‌వ్వు రావాల్సిందే. అందుకోసం పిల్ల‌గాడు పెద్ద‌గా ఏం చేయ‌లేదు. త‌నంత‌ట తాను ఆడుకుంటున్నాడు. డియోలో చూస్తున్న‌ట్ల‌యితే అది పెద్ద మాల్‌లా ఉంది. అక్క‌డ ఒక పెద్ద అద్దం ఉంది. అందులో ఈ పిల్ల‌వాడు చాలా అందంగా క‌నిపిస్తున్నాడు. 

అయితే.. ప‌క్క‌కు వ‌స్తే ఆ బొమ్మ మ‌ర‌లా క‌నిపించ‌డం లేదు. ఎడ‌మ చేతివైపుకు వ‌స్తే మాత్రం మ‌ళ్లీ అదే బొమ్మ‌. అచ్చం నాలానే ఉంద‌ని పిల్లాడు అశ్చ‌ర్య‌పోతున్నాడు. దీన్ని ప‌లుసార్లు ప‌రీక్షిస్తాడు. నేను ప‌క్క‌కు పోతే వ‌స్తుందో లేదో చూద్దాం అన్న‌ట్లు. అయినా రాదు. ఎంత‌సేపు ఇలా చేస్తుందో అని టెస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈ వీడియోని ఇండియ‌న్ యాక్ట‌ర్, క‌మేడియ‌న్‌,  డ్యాన్స‌ర్ అయిన జావేద్ జాఫేరి ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది వైర‌ల్ అవుతున్న‌ది. పిల్ల‌ల ఆట‌లు చాలా ఫ‌న్నీగా ఉంటాయి అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo