ఆదివారం 05 జూలై 2020
National - Jun 24, 2020 , 15:21:11

జవాన్‌ సునీల్‌ కాలె పిల్లల బాధ్యత మాది : సిద్ధి వినాయక ట్రస్టు

జవాన్‌ సునీల్‌ కాలె పిల్లల బాధ్యత మాది : సిద్ధి వినాయక ట్రస్టు

ముంబై : జూన్‌ 23న పుల్వామాలో టెర్రరిస్టుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ సునీల్‌ కాలె పిల్లలను తాము చదివిస్తామని సిద్ధి వినాయక గణపతి దేవస్థాన ట్రస్టు నిర్వాహకులు బుధవారం తెలియజేశారు. సునీల్‌ కాలె మహారాష్ట్రలోని సోలాపూర్‌ వాసి. ఇతను సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) 182వ బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌. జమ్ము అండ్‌ కాశ్మీర్‌ పుల్వామాలోని బాండ్సూ ఏరియాలో కాపలాగా ఉన్న సెక్యూరిటీ ఫోర్స్‌ మీద మంగళవారం ఇద్దరు టెర్రరిస్టులు తుపాకితో కాల్పులు జరపడంతో సునీల్‌ కాలెకు బుల్లెట్‌ తగిలి తీవ్ర రక్తస్రావమై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 


logo