బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 01:08:23

ఉద్ధవ్‌ సీఎం సీటు పదిలం

ఉద్ధవ్‌ సీఎం సీటు పదిలం

ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రే పదవి విషయంలో అనిశ్చితి పూర్తిగా వీడింది. గురువారం ఆయన రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చట్టసభకు ఎన్నికవటం ఉద్ధవ్‌ రాజకీయజీవితంలో ఇదే తొలిసారి. గతేడాది నవంబర్‌లో అనూహ్యంగా సీఎం బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్‌ ఈ నెలాఖరులోపు చట్టసభ నుంచి ఎన్నిక కావల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే.


logo