గురువారం 02 జూలై 2020
National - Jun 29, 2020 , 12:51:20

హార్లే డేవిడ్‌స‌న్ బైక్ న‌డిపిన‌ సీజే బోబ్డే.. ఫోటోలు వైర‌ల్‌

హార్లే డేవిడ్‌స‌న్ బైక్ న‌డిపిన‌ సీజే బోబ్డే.. ఫోటోలు వైర‌ల్‌

హైద‌రాబాద్‌:  సంచ‌ల‌న తీర్పులు ఇవ్వ‌డ‌మే కాదు.. బైక్ రైడింగ్ అంటే కూడా చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డేకు ఇష్టం‌.  64 ఏళ్ల బోబ్డే తాజాగా ఖ‌రీదైన హ‌ర్లే డేవిడ్‌స‌న్ బైక్‌పై క‌నిపించారు. ఇక ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల్ల నాగ‌పూర్‌లోని త‌న సొంత ఇంట్లోనే బోబ్డే ఉంటున్నారు.  2019 న‌వంబ‌ర్‌లో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బోబ్డే బాధ్య‌త‌లు స్వీక‌రించారు.  ఆ స‌మ‌యంలో ఇచ్చిన ప‌లు ఇంట‌ర్వ్యూల్లో ఆయ‌న త‌న‌కు బైక్‌ల‌పై ఉన్న మ‌క్కువను వెల్ల‌డించారు.  ఓసారి బైక్ న‌డుపుతూ ప్ర‌మాదానికి గురికావ‌డ వ‌ల్ల .. కోర్టుకు హాజ‌రుకాలేక‌పోయిన‌ట్లు కూడా తెలిపారు. తాజాగా హార్లే డేవిడ్‌స‌న్ లిమిటెడ్ ఎడిష‌న్ సీవీవో 2020 మోడ‌ల్‌ను సీజే బోబ్డే ట్ర‌య‌ల్ రైడ్‌ చేశారు.  

అయోధ్య లాంటి వివాదాస్ప‌ద అంశంపై బోబ్డే తీర్పునిచ్చారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో న్యాయ‌వాదులు న‌ల్ల కోట్లు వేసుకోరాదు అని, తెల్ల‌టి ష‌ర్ట్‌లు ధ‌రించి, దానిపై బ్లాక్ నెక్ బ్యాండ్ వేసుకుంటే స‌రిపోతుంద‌ని అన్నారు.  ఇటీవ‌ల తీర్పుల‌న్నీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే నిర్వ‌హిస్తున్నారాయ‌న‌.  తాజాగా జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్రపైన కూడా ఆయ‌న తీర్పునిచ్చారు.  యాత్ర‌కు అనుమ‌తిస్తే, జ‌గ‌న్నాథుడు మమ్ముల్ని క్ష‌మించ‌డ‌ని బోబ్డే తీర్పునిచ్చారు.   

అయితే హార్లే డేవిడ్‌స‌న్ సూప‌ర్‌బైక్ పై బోబ్డే.. మాస్క్ లేకుండా ఉండ‌డాన్ని కొంద‌రు నెటిజ‌న్స్ త‌ప్పుప‌ట్టారు. సీజే కొత్త అవ‌తారం బాగున్నా.. లాక్‌డౌన్ నియ‌మావ‌ళి ఉల్లంఘించిన‌ట్లు ఉంద‌ని కొంద‌ర‌న్నారు.logo