గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 13:01:27

ఆ వెయ్యి కోట్ల‌తో వారికి ఏం లాభం: చిదంబ‌రం

ఆ వెయ్యి కోట్ల‌తో వారికి ఏం లాభం: చిదంబ‌రం

న్యూఢిల్లీ: ఇప్ప‌టికే మోదీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తున్న ఉద్దీపన ప్యాకేజీలు, కేటాయింపులపై పెదవి విరుస్తున్న కేంద్ర‌ మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్  నేత పీ చిదంబరం.. తాజా పీఎం కేర్స్ ఫండ్ నుంచి వ‌ల‌స కార్మికులకు సాయం కోసం కేటాయించిన రూ.1000 కోట్ల నిధుల‌పై కూడా పెద‌వి విరిచారు. ఆ రూ.1000 కోట్ల‌తో వ‌ల‌స కార్మికుల‌కు నేరుగా ఎలాంటి లాభం ఉండ‌ద‌ని, ఆ నిధులు వ‌ల‌స కార్మికుల స‌హాయార్థం రాష్ట్రాల ఖాతాల్లోకి వెళ్తాయ‌ని ఆయ‌న వివ‌రించారు. 

కాబ‌ట్టి, వ‌ల‌స కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరేలా కేంద్రం నిధులు కేటాయించాల‌ని ఆయ‌న సూచించారు. లేదంటే అన్ని ఆదాయ వనరులు మూసుకుపోయిన తర్వాత‌ వలస కార్మికుడి జీవనం ఎలా కొన‌సాగుతుంద‌ని ఆయన ప్రశ్నించారు. అన్ని అడ్డంకులు దాటుకుని స్వ‌గ్రామాల‌కు చేరిన  కార్మికుడికి గ్రామంలో ఉపాధి, ఉద్యోగాలు ఉండ‌వ‌ని, ఆదాయం రాద‌ని, ఇలాంటి పరిస్థితుల్లో వారు తమ‌ కుటుంబాల‌ను ఎలా పోషించుకుంటార‌ని చిదంబరం ప్ర‌శ్న లేవ‌నెత్తారు. 


logo