శుక్రవారం 05 జూన్ 2020
National - May 21, 2020 , 08:22:25

నేడు రాజీవ్‌గాంధీ కిసాన్‌ న్యాయ్‌ యోజన ప్రారంభం

నేడు రాజీవ్‌గాంధీ కిసాన్‌ న్యాయ్‌ యోజన ప్రారంభం

రాయ్‌పూర్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందడుగు వేసింది. రైతులను ఆదుకునేందుకు రాజీవ్‌గాంధీ కిసాన్‌ న్యాయ్‌ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. పథకం అమలులో భాగంగా నేడు మొదటిదశలో రూ. 1500 కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమచేయనుంది. ఈ పథకం కింద మొత్తం రూ.5,700 కోట్లు కేటాయించింది. ఈ పథకం ప్రారంభోత్స కార్యక్రమంలో ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొననున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేల్‌ భాగెల్ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 9 లక్షల 53 వేల 706 మంది సన్నకారు రైతులు, 5 లక్షల 60 వేల మంది చిన్నకారు రైతులు అదేవిధంగా 3 లక్షల 20 వేల 844 మంది పెద్ద రైతులు లబ్దిపొందనున్నారు. 


logo