మంగళవారం 19 జనవరి 2021
National - Jan 11, 2021 , 21:42:11

ఏనుగుల దాడి.. ముగ్గురు మృతి

ఏనుగుల దాడి.. ముగ్గురు మృతి

రాయ్‌పూర్‌: ఏనుగుల దాడుల్లో ముగ్గురు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్‌ ప్రాంతంలో ఈ ఘటనలు జరిగాయి. ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఏనుగులు తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారి జాదవ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా జరిగిన మూడు ఏనుగుల దాడుల ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు చనిపోయినట్లు చెప్పారు. ఏనుగుల దాడుల నుంచి ప్రజలను కాపాడేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు వెల్లడించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.