ఆదివారం 12 జూలై 2020
National - Jun 30, 2020 , 13:08:10

పిడుగు ప‌డితే పేడ‌లో పూడ్చారు.. మూఢ‌న‌మ్మకాల‌ను వ‌ద‌ల‌ని గ్రామ‌స్తులు!

పిడుగు ప‌డితే పేడ‌లో పూడ్చారు.. మూఢ‌న‌మ్మకాల‌ను వ‌ద‌ల‌ని గ్రామ‌స్తులు!

ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజనులు ఎక్కువగా ఉండే జశ్‌పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురైన వ్యక్తులను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా పేడలో పూడ్చి చికిత్స అందించారు. దాంతో పరిస్థితి విషమించి ఇద్దరు మరణించారు. గ్రామ‌స్తుల అవివేకానికి రెండు నిండు ప్రాణాలు బ‌ల‌య్యాయి.

పోలీసుల వివ‌రాల ప్ర‌కారం అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. జశ్‌పూర్ జిల్లా బాగ్‌బహర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో సునీల్ సాయి (22), చంపా రౌత్ (20) అనే మ‌హిళ‌తో పాటు మరో యువకుడు పొలంలో పనిచేసుకుంటున్నారు. వర్షం వ‌స్తుంద‌ని చెట్టు కింద‌కి చేరారు. పెద్ద ఉరుములు, మెరుపుల‌తో వారున్న చెట్టు మీద‌నే పెద్ద పిడుగు వ‌చ్చి ప‌డింది. దీంతో ఆ ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని హాస్పిట‌ల్‌కు చేర్చ‌కుండా అక్క‌డ గ్రామ‌స్తులు మూఢ‌న‌మ్మ‌కాన్ని ఫాలో అయ్యారు. వారిని కాళ్ల నుంచి మెడ‌వ‌ర‌కు పేడ‌లో పూడ్చారు. అలా చేస్తే కాలిన గాయాలు న‌య‌మ‌వుతాయ‌ని వారి న‌మ్మ‌కం. అక్క‌డ చ‌దువుకున్న‌కొంద‌రు యువ‌కులు వాద‌న‌కు దిగ‌డంతో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అప్ప‌టికే  సునీల్ సాయి, చంపా రౌత్ చ‌నిపోయారు. మ‌రో యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. logo