శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 13:01:16

ఊరూరా తిరిగి బైక్ మీద పాఠాలు చెబుతున్న టీచ‌ర్!

ఊరూరా తిరిగి బైక్ మీద పాఠాలు చెబుతున్న టీచ‌ర్!

క‌రోనా వ్యాప్తి కారణంగా పాఠశాలలు మూత‌బ‌డ్డాయి. దీంతో పిల్ల‌లు ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. మ‌రి ప్ర‌భుత్వ స్కూల్స్‌లో చ‌దివే పిల్ల‌ల చ‌దువు గురించి దేవుడికే ఎరుక అన్న‌ట్లుంది. అందుకే ఈ ఉపాధ్యాయుడు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. త‌న బైక్ మీద ఒక గొడుగు పెట్టుకొని దానికే బ్లాక్‌బోర్డును అమ‌ర్చాడు. చుట్టూ కొన్ని ప్ల‌కార్డులు కూడా క‌ట్టాడు. అంతేకాదు పుస్త‌కాలు కూడా ఇత‌ని వ‌ద్ద ఉన్నాయి. ఈ బండి మీద వీధి వీధి తిరుగుతూ పిల్ల‌ల‌కు పాఠాలు చెబుతున్నాడు. ఈ సంఘ‌ట‌న ఛ‌త్తీస్‌ఘ‌డ్‌లో కొరియా జిల్లాలో చోటు చేసుకున్న‌ది.

రుద్ర రానా అనే టీచ‌ర్‌ పిల్ల‌ల‌కు చ‌దువు నేర్పేందుకు మొహ‌ల్లా క్లాసులు తీసుకుంటున్నాడు. విద్య‌ను పిల్ల‌ల ఇంటి గుమ్మానికే తీసుకువ‌చ్చాడు. సేమ్ స్కూల్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్క‌డ కూడా అలానే ఉంటుంది. రానా రాగానే బెల్ మోగిస్తాడు. ఆ శ‌బ్దానికి విద్యార్థులు వ‌స్తారు. త‌ర్వాత ప్రేయ‌ర్ చేస్తారు. ఇప్పుడు సిల‌బ‌స్ ప్ర‌కారం త‌ర‌గ‌తులు ప్రారంభిస్తాన‌ని రానా చెప్పుకొచ్చాడు. ఇలా ఒక ప్రాంతం నుంచి మ‌రొక ప్రాంతానికి ప్ర‌యాణించి విద్యార్థుల‌ను సేక‌రించి విద్యాబోధ‌న చేస్తున్నాడు. ఇతను చేస్తున్న మంచి ప‌నికి స్థానికులు కూడా స‌హాయం చేస్తున్నారు. విద్యార్థులు కూడా ఇత‌ని వ‌ద్ద చ‌దువుకోవ‌డానికి మొగ్గ చూపుతున్నారు. క‌రోనా టైంలో ఇత‌ని ఆలోచ‌న‌కు నెటిజ‌న్లు ఫిదా అయ్యారు.