ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 23:06:46

హాట్‌స్పాట్లలో ఆగష్టు 6వరకు లాక్‌డౌన్‌ : ఛతీస్‌గఢ్‌ సీఎం

హాట్‌స్పాట్లలో ఆగష్టు 6వరకు లాక్‌డౌన్‌ : ఛతీస్‌గఢ్‌ సీఎం

రాయ్పూర్‌ : ఛత్తీస్గఢ్‌‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు హాట్స్పాట్ ప్రాంతాల్లో ఆగస్టు 6 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ అధ్యక్షతన ఆయన నివాస కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కరోనా కేసుల సంఖ్యను బట్టి స్థానిక స్థాయిలో కలెక్టర్లు లాక్డౌన్నిర్ణయాన్ని తీసుకోవచ్చని పేర్కొన్నారు.

అనంతరం వ్యవసాయ, జల వనరులశాఖ మంత్రి రవీంద్ర చౌబే మాట్లాడుతూ.. రాయ్పూర్, దుర్గ్, బిలాస్పూర్ నగరాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ను ఆగస్టు 6 వరకు పొడిగించిందని తెలిపారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించారు. జిల్లా నిధిని ఉపయోగించుకుని అదనపు ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలను నియమించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగుపై సమావేశంలో చర్చించారు. ఖరీఫ్లో సాగునీటి అవసరాన్ని, జలాశయాల్లో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని జులై 28 నుంచి సాగునీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


logo