గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 10:15:14

లాక్‌డౌన్‌ ప్రకటించిన ఛత్తీస్‌గఢ్‌

లాక్‌డౌన్‌ ప్రకటించిన ఛత్తీస్‌గఢ్‌

రాయపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెలువరించింది. ఆయా ప్రాంతాల్లో మార్చి 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగనున్నట్లు ప్రకటించింది. దీంతో అత్యవసర సేవల విభాగాలు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోనుంది. 500 మందికి చికిత్స చేసే సౌకర్యాలను అదేవిధంగా మరో 1500 మందిని క్వారంటైన్‌లో ఉంచే సామర్థ్యాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, బిహార్‌, నాగాలాండ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రం 80 జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించింది.


logo