శనివారం 30 మే 2020
National - May 09, 2020 , 11:04:02

రాష్ర్టానికి రూ. 30 వేల కోట్ల ప్యాకేజీ కోరుతూ ప్రధానికి లేఖ

రాష్ర్టానికి రూ. 30 వేల కోట్ల ప్యాకేజీ కోరుతూ ప్రధానికి లేఖ

రాయ్‌పూర్‌ : చత్తీస్‌గఢ్‌ రాష్ర్టానికి ఆర్థిక సాయం కోరుతూ ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బాగెల్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. కోవిడ్‌-19 కారణంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందన్నారు. కావునా వచ్చే మూడు నెలలకు గాను రూ. 30 వేల కోట్ల ప్యాకేజీని రాష్ర్టానికి ప్రకటించాల్సిందిగా భగాలే కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తంలో తక్షణ సాయం కింద రూ. 10 వేల కోట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా ప్రధానిని కోరారు. అప్పుడు మాత్రమే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపైకి ఎక్కించవచ్చన్నారు. 

కేంద్ర ప్రభుత్వం దేశంలోని జిల్లాలను కరోనా వైరస్‌ తీవ్రతను బట్టీ రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించింది. గ్రీన్‌ జోన్స్‌లో పనులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా జోన్లలో ఆర్థిక కార్యకలాపాల వల్ల ప్రజల రాకపోకలు అధికమయ్యాయి. దీంతో కేసుల సంఖ్య అధికమయ్యే అవకాశం ఉందని భగాలే పేర్కొన్నారు. కేసులు పెరిగితే ఆయా ప్రాంతాలను తిరిగి రెడ్‌ జోన్లుగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఇలా షాపులు తెరవడం, మూసివేయడం ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. అదేవిధంగా ప్రజల్లో అసంతృప్తికి దారితీస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మే 17వ తేదీన తర్వాత లాక్‌డౌన్‌ను కొనసాగించడంపై అనిశ్చితి నెలకొని ఉందన్నారు. 


logo