బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 21:39:25

వినూత్న దీపం.. నూనె అయిపోని వైనం

వినూత్న దీపం.. నూనె అయిపోని వైనం

రాయ్‌పూర్‌: దీపావళి నేపథ్యంలో ఒక కుమ్మరి వినూత్న మట్టి దీపాన్ని తయారు చేశాడు. ప్రమిదలో పోసిన నూనె అయిపోని విధంగా దీనిని రూపొందించాడు. ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌కు చెందిన కుమ్మరి అశోక్ చక్రధారి ఒక ప్రత్యేక మట్టి దీపాన్ని తయారు చేశాడు. ఇందులో ఒకసారి నూనె పోస్తే చాలు. ఆ దీపంలోకి నూనె ఆటోమెటిక్‌గా ప్రసారం అవుతుంది. తాను ఆన్‌లైన్‌లో చాలా వీడియోలు చూసి ఈ ప్రత్యేక మట్టి దీపాన్ని తయారు చేసినట్లు కుమ్మరి అశోక్‌ చక్రధారి తెలిపాడు. దీపావళి పండుగ సమీపిస్తుండటంతో వినూత్నంగా ఉన్న ఈ దీపాలకు భారీ సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని అతడు చెప్పాడు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.