మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 18:58:43

ఎదురు కాల్పుల్లో పోలీసు మృతి.. మరొకరికి గాయాలు

ఎదురు కాల్పుల్లో పోలీసు మృతి.. మరొకరికి గాయాలు

నారాయణపురం : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య శనివారం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ పోలీసు మృతిచెందగా.. మరొకరికి గాయాలైనట్లు నారాయణపూర్‌ జిల్లా ఎస్పీ మోహిత్‌ గంగ్‌‌ తెలిపారు.  నారాయణపూర్‌ జిల్లా ఓర్చాకు 8 కిలోమీటర్ల దూరంలోని తాడూర్‌ వద్ద డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డు బృందంపై నక్సల్స్‌ మెరుపుదాడి చేశారు.

భద్రతా సిబ్బంది తేరుకొని కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఓ పోలీసు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరొకరిని చికిత్స నిమిత్తం  నారాయణపూర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు. కాల్పుల్లో కొంతమంది నక్సల్స్‌ సైతం గాయపడ్డారని, వారి స్థావరం ధ్వంసమైందని ఆయన వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.