బుధవారం 25 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 16:22:58

ఛ‌ట్ పూజా ఊరేగింపులను నిషేధించిన కోల్‌కతా హైకోర్టు

ఛ‌ట్ పూజా ఊరేగింపులను నిషేధించిన కోల్‌కతా హైకోర్టు

కోల్‌కతా: ఈ ఏడాది దీపావళికి పటాకులు నిషేధించిన తరువాత.. కోల్‌కతా హైకోర్టు పశ్చిమ బెంగాల్‌లో ఛ‌ట్ పూజా ఊరేగింపులను కూడా నిలిపివేసింది. ఈ మేరకు బుధవారం ఉదయం కోల్‌కతా హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఛత్‌ పూజ సందర్భంగా కోల్‌కతాలోని రెండు పెద్ద సరస్సులైన సుభాస్, రవీంద్ర సరోబార్‌లోకి ప్రజలు ప్రవేశించడంపై నిషేధం విధించారు. 

“కోల్‌కతా హైకోర్టు ఛ‌ట్ పూజా ఊరేగింపులను నిషేధించింది. ఒక కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పూజలు చేయడానికి ఏదైనా నీటి కుంటలోకి వెళ్లొచ్చు. వాహనాల్లో వచ్చే భక్తులు నిర్ణీత దూరాన్ని పాటించాల్సి ఉంటుంది” అని హైకోర్టు న్యాయవాది సబ్యసాచి ఛటర్జీ తెలిపారు. ఇతర కుటుంబ సభ్యులు ఇంటి నుంచి లేదా ఇంటికి సమీపంలో పూజలు చేపట్టేలా చూసుకోవాలి. ఒక ప్రాంతంలో ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ముఖాలకు మాస్కులు ధరించి కొవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించాలని కోల్‌కతా హైకోర్టు సూచించింది. హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నవంబర్ 30 వరకు టపాసులు కాల్పడంపై నిషేధం విధించినందున నగరంలో ఎటువంటి క్రాకర్లను విక్రయించకూడదు, కాల్చకూడదని పోలీసులు ప్రచారం చేపడుతున్నారు. ఎన్‌జీటీ నిషేధం విధించినప్పటికీ, ఛ‌ట్  ఆచారాలను నిర్వహించడానికి గత ఏడాది నవంబర్‌లో రవీంద్ర సరోబార్ ద్వారాలను తెరిచి భారీ సంఖ్యలో ప్రజలు నీటిలోకి ప్రవేశించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈసారి కోల్‌కతా హైకోర్టు ముందుగానే ఉత్తర్వులు జారీచేసింది. అవసరమైతే సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద ఆంక్షలు విధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. ఛ‌ట్‌ పూజలు నవంబర్‌ 20 న జరుగనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.