మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 21:47:35

చెన్నైలో కరోనాపై ట్రాన్స్‌జెండర్ల పోరాటం

చెన్నైలో కరోనాపై ట్రాన్స్‌జెండర్ల పోరాటం

చెన్నై : తమిళనాడులోని చెన్నైలో కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ట్రాన్స్‌జెండర్లు పోరాడుతున్నారు. ఇంటింటికీ స్క్రీనింగ్‌, గ్రౌండ్‌ లెవల్‌లో సమన్వయం చేయడం తదితర సేవల్లో స్వచ్ఛంద సంస్థల సభ్యులతో కలిసి సేవలందిస్తున్నారు. రద్దీ మురికివాడల్లో, భారీగా కేసులున్న ప్రాంతాల్లోనూ తిరుగుతూ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొవడంలో ప్రభుత్వ అధికారులతో కలిసి ట్రాన్స్‌జెండర్లు ప్రచారం చేస్తున్నారు. చెన్నై కార్పొరేషన్ భాగస్వామ్యంతో ట్రాన్స్‌జెండర్లు రోజుకు ఎనిమిది గంటల పాటు ప్రచారం పాల్గొంటుండగా, వంద రోజుల ఉపాధి పథకంలో భాగంగా వారికి నెలకు రూ.15వేలు, అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.

అధికారులు తమకు తమకు ప్రాథమికంగా అవగాహన, నివారణ, నియంత్రణ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమంలో కాలినడకన ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, రోగ నిరోధక శక్తిని పెంచే చర్యలపై వివరిస్తున్నట్లు ఎన్జీవో జనరల్‌ మేనేజర్‌ జయ తెలిపారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో సమూహాలుగా వెళ్లి లౌడ్‌స్పీకర్లతో పాటు వ్యక్తిగతం ప్రజలను కలిసి వారి సందేహాలను నివృత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉచితంగా క్లాత్‌మాస్కులు, రోగ నిరోధక శక్తిని పెంచే ద్రావణాలు పంపిణీ పంపిణీ చేస్తున్నారు. నియంత్రణ చర్యలో భాగంగా వ్యక్తిగతం 150 ఇండ్లు తిరుగుతూ జ్వరం బారినపడ్డ, రోగ లక్షణాలున్నవారి వివరాలు సేకరించి స్థానిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేలా సలహాలు సూచనిస్తున్నారు. 

ఇటీవల నృత్యాలు, నాటకాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఎన్జీవో జీఎం జయ వివరించారు. జాతీయస్థాయిలో అందాల పోటీల్లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు కూడా ప్లకార్డులు పట్టుకొని.. నినాదాలు చేస్తూ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. వంద రోజుల పథకం ట్రాన్‌జెండర్లకు వరంగా మారిందని, అయితే ఇది అనుకున్నంత సులభం కాదని పేర్కొన్నారు. కాగా, మొదట్లో చాలా మంది ప్రజలు వారిని నిందించారని, తమ ఇండ్లకు రోజు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారని థోజీ స్వచ్ఛంద డైరెక్టర్‌ సుధ తెలిపారు.

ప్రజల్లో ఉన్న అపోహలు, వివక్షలు ఉన్నాయని.. చివరకు సాన్నిహిత్యం వచ్చి కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని పేర్కొన్నారు. టాన్స్‌జెండర్స్‌ చిన్న చిన్న మార్గాల్లో సమాజానికి సేవ చేయడం సంతోషకరమని జయ పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం మంచి అనుభమని, ఆర్థికంగా తనకు ఉపయోగపడుతుందని స్నేగిటీ ఎన్జీవోకు చెందిన ధనబాషియం తెలిపారు. ఈ అవకాశం లభించినందుకు సంతోషిస్తున్న' అని చెప్పారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo