శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 19:16:29

పది రూపాయల డాక్టర్‌ ఇక లేరు..

పది రూపాయల డాక్టర్‌ ఇక లేరు..

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో పది రూపాయల డాక్టర్‌గా పేరొందిన ప్రముఖ వైద్యుడు సీ మోహన్‌రెడ్డి (84) ఇక లేరు. శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ ఆయన ఆదివారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారినపడ్డ ఆయన కోలుకున్నారు. దాతృత్వానికి ప్రసిద్ధి చెందిన మోహన్‌రెడ్డి వయస్సు సహకరించనప్పటికీ కొవిడ్‌-19కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాల్గొని చాలా మంది పేషెంట్లకు సేవలందించారు. డాక్టర్‌ జూన్ 25న కరోనా బారినపడి, నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. అనంతరం కోలుకోగా, శ్వాసకోశ వైఫల్యంతో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించారని ఆయన సోదరుడు వాస్కులర్‌ సర్జన్‌ డాక్టర్‌ సీఎంకేరెడ్డి చెప్పారు.

బ్రహ్మచారి ఆయన డాక్టర్‌ రెడ్డి తన జీవితమంతా రోగుల కోసం 24గంటలు దవాఖానలోనే అందుబాటులో ఉండి సేవలందించే వారు. రూ.10 డాక్టర్‌గా పేరు పొందిన ఆయన వద్దకు భారీగా జనం క్యూలు కట్టే వారు. ముఖ్యంగా మురికి వాడల నుంచి జనం తరలివచ్చే వారు. 1936లో నెల్లూరులో జన్మించిన డాక్టర్ రెడ్డి తన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని గూడూరులో పూర్తి చేశారు. అనంతరం కిల్పాక్‌ మెడికల్‌ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాడు. కరోనా సమయంలోనూ రోగుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపారని, అలాగే నగరంలోని అనేక సంస్థలకు విరాళాలు ఇచ్చారని, తన వద్దకు వచ్చిన వారికి ఎన్నడూ కాదనకుండా సహాయం అందించారని ఆయన సోదరుడు సీఎంకే రెడ్డి చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo