బుధవారం 27 జనవరి 2021
National - Jan 02, 2021 , 17:32:20

కరోనా హాట్‌స్పాట్‌గా లగ్జరీ హోటల్‌..!

కరోనా హాట్‌స్పాట్‌గా లగ్జరీ హోటల్‌..!

చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. చెన్నైలోని లగ్జరీ హోటల్‌ ప్రస్తుతం కొవిడ్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. చెన్నైకి సమీపంలోని గిండిలో గల ఐటీసీ గ్రాండ్‌ చోళ హోటల్‌లో సిబ్బందితో సహా 85 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  

'డిసెంబర్‌ 15న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు మొత్తం 609 శాంపిల్స్‌ను పరీక్షించగా అందులో 85 మందికి వైరస్‌ సోకింది. హోటల్‌లో ఉంటున్నవారితో పాటు వారితో కాంటాక్ట్‌ అయిన వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని చెన్నై కార్పొరేషన్‌ సూచించిందని' రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్‌ పేర్కొన్నారు. 

చెన్నైలోని అన్ని లగ్జరీ హోటళ్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు ధ్రువీకరించారు.  గత డిసెంబర్‌లో ఐఐటీ మద్రాస్‌ కొవిడ్‌  హాట్‌స్పాట్‌గా మారిన విషయం తెలిసిందే. సుమారు 200 మంది ఐఐటీ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. 


logo