శనివారం 24 అక్టోబర్ 2020
National - Sep 23, 2020 , 13:47:05

ఫోన్ కోసం దొంగ‌గా మారిన స్టూడెంట్‌.. అంతా ఆన్‌లైన్ క్లాసులు మ‌హిమ‌

ఫోన్ కోసం దొంగ‌గా మారిన స్టూడెంట్‌.. అంతా ఆన్‌లైన్ క్లాసులు మ‌హిమ‌

చ‌దువు మీద ఉన్న శ్ర‌ద్ద‌తో ఓ స్టూడెంట్ దొంగ‌గా మారాడు. క‌రోనా నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తున్నారు. క్లాసుల‌కు హాజ‌రు కావాలంటే స్మార్ట్ ఫోన్, ఇంట‌ర్‌నెట్ త‌ప్ప‌నిస‌రి. పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం పేద‌వాళ్లు త‌మ దాచుకున్న డ‌బ్బుతో ఫోన్ కొని అందిస్తున్నారు. ఫోన్ కొనే స్థితిలో లేనివాళ్లు చ‌దువుకు దూర‌మ‌వుతున్నారు. చ‌దువు మీద ఉన్న ఇష్టంతో తిరువొట్టియుర్‌కు చెందిన 13 ఏండ్ల బాలుడు స్మార్ట్ ఫోన్ దొంగిలించేందుకు పాల్ప‌డ్డాడు. ఈ ప్రాసెస్‌లో బాలుడు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. విద్య మీద అత‌నికి ఉన్న ఇష్టం చూసి ఆ మ‌హిళా పోలీస్ స్మార్ట్‌ఫోన్ కొనిచ్చింది. అయితే.. బాలుడిని దొంగ‌త‌నం చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది మాత్రం దొంగ‌ల ముఠా. పోలీసులు ఆరా తీస్తే బాలుడు చెప్పుకొచ్చాడు. 

'మీ అమ్మ పాచి ప‌నిచేస్తుంది. నాన్న బిస్కెట్ షాపులో ప‌నిచేస్తాడు. నీకు ఫోన్ కొనివ్వ‌లేని ప‌రిస్థితి. దీంతో నువ్వు క్లాసుల‌కు అటెండ్ అవ్వ‌లేవు. నువ్వు చ‌దువుకోవాలంటే ఒక ఫోన్ దొంగ‌త‌నం చేయాలి. అప్పుడు దాని నుంచి నువ్వు క్లాసులు వినొచ్చు' అని బాలుడికి నూరిపోశారు. అది నిజ‌మే అనుకొని బాలుడు లారీ డ్రైవ‌ర్ ద‌గ్గ‌ర ఫోన్ దొంగ‌లించి పారిపోయాడు. అక్క‌డున్న స్థానికులు బాలుడిని ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు. దీంతో బాలుడి క్షేమం, భ‌విష్య‌త్తు పాడ‌వ‌కూడ‌ద‌ని తిరువొట్టియుర్ క్రైమ్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఎస్. భువనేశ్వరి త‌న కూతురికు స్మార్ట్‌ఫోన్ కొనివ్వాల‌నుకున్న డ‌బ్బుల‌తో బాలుడికి ఫోన్ కొనిచ్చింది. ఇలాంటి ప‌నులు ఇంకోసారి చేస్తే శిక్ష చాలా క‌ఠినంగా ఉంటుంద‌ని హెచ్చ‌రించి బాలుడిని వ‌దిలేసింది. ఈ వ‌య‌సులో అత‌నికి శిక్ష విధిస్తే వారి ఆలోచ‌న‌లు త‌ప్పుదోవ ప‌డుతాయ‌ని భువ‌నేశ్వ‌రి వెల్ల‌డించారు. 


logo