శనివారం 04 జూలై 2020
National - Jun 28, 2020 , 15:29:31

పాటలు పాడి.. రూ.15లక్షలు సేకరణ

పాటలు పాడి.. రూ.15లక్షలు సేకరణ

చెన్నై : కరోనా మహమ్మారితో ఇబ్బందులుపడుతున్న సంగీత కళాకారులకు సహాయార్థం చెన్నైకి చెందిన ఓ నేపథ్య గాయకుడు గత 64 రోజుల్లో లైవ్‌లో పాటలు పాడి రూ.15లక్షలు సేకరించాడు. ఇందుకు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో ‘సత్యన్‌ ఉత్సవ్‌’ పేరిట బ్లాగ్‌ను ప్లేబ్యాక్‌ సింగర్‌ సత్యన్‌ మహాలింగం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.15లక్షలకుపైగా సేకరించినట్లు తెలిపారు. సంగీత పరిశ్రమతో సంబంధం ఉన్న ప్రజల జీవనోపాధికి మద్దతు ఇచ్చేందుకు ఈ ‘మ్యూజిక్‌ 4 మ్యూజిషియన్స్‌’ ప్రారంభించినట్లు చెప్పారు.

ఇంతకు ముందు ఒక్క నెలలో 40 నుంచి 45 ప్రోగ్రామ్‌లు ఇచ్చే వాళ్లమని, కనీస సంపాదన రూ.50వేలకుపైగానే ఉండేదని చెప్పారు. లాక్‌డౌన్‌తో సంపాదన సున్నాకు పడిపోయిందని, ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో మాకు తెలియదంటూ మహాలింగం తెలిపారు. నేను సంగీత పరిశ్రమ నుంచి వచ్చానని, మనుగడ ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించానని, పరిశ్రమకు నేను కొంత సహాయం చేయగలిగానన్నారు. మే 30న రంగస్థల సంగీత కళాకారులకు సహాయంగా నిధులు సేకరించేందుకు నిరంతరాయంగా 25 గంటలు పాటలు పాడినట్లు మహాలింగం వివరించారు. 


logo