గురువారం 09 జూలై 2020
National - Jun 27, 2020 , 22:47:41

మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు

మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై విమానాశ్రయంలో ఓ విదేశీ పోస్టల్‌ పార్సిల్లో ఎండీఎంఏ(3,4మిథైలిన్‌ డైఆక్సీ-మిథఫెటమైన్‌)గా అనుమానిస్తున్న 270 బిల్లలను శనివారం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్య పదార్థం విలువ 8లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్సిల్‌ యూకేలోని బర్మింగ్‌హామ్‌ దగ్గరలోని ఓల్‌వేర్‌హంటన్‌ నుంచి చెన్నై విదేశీ పోస్టాఫీసుకు వచ్చింది. పార్సిల్‌ అనుమానాస్పదంగా ఉండడంతో పరిశీలించగా నీలిరంగు మాత్రలు ఉండడంతో పరీక్షించగా మాదక ద్రవ్య తయారీ పదార్థం(ఎండీఎంఏ)గా నిర్ధారణ అయ్యింది. ఈ మాత్ర బ్లూ పునిషర్‌గా పేరుందని దీనిపై పుర్రె గుర్తు ఉంటుందని యూకేలో దీనికి మంచి డిమాండ్‌ ఉందని ఇందులో అధిక మొత్తంలో ఎండీఎంఏ పదార్థం ఉంటుందని అధికారులు తెలిపారు. పార్సిల్‌పై పొందే వ్యక్తి  పేరు అసంపూర్తిగా ఉందని, చిరునామా తిరువళ్లూరు జిల్లాగా గుర్తించారు. ఆచూకీ కనుగోని ఓ వ్యక్తిని ఇంట్లోనే అదుపులోకి తీసుకొని డ్రగ్స్‌ సమ్లింగ్‌ కేసులో అతడి పాత్రపై విచారణ చేస్తున్నారు. అంతముందు ఇదే విమానశ్రయంలో జర్మని, నెథర్లాండ్స్‌ నుంచి పంపిన ఎక్ట్సాటిక్‌ మాత్రలను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.


logo