మంగళవారం 14 జూలై 2020
National - Jun 26, 2020 , 19:49:15

మిడతలను అదుపు చేసేందుకు రసాయనాల పిచికారీ

మిడతలను అదుపు చేసేందుకు రసాయనాల పిచికారీ

వారణాసి : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసి పట్టణం నయీపూర్‌ప్రాంతంలో మిడతలను అదుపు చేసేందుకు ఆరుగురు ఫైర్‌ టెండర్లు, 40మంది సాధారణ స్ప్రేయర్లతో గురువారం రాత్రి వరకు రసాయనాలు పిచికారీ చేశారు. డీఎం కౌశల్‌రాజ్‌శర్మ సైతం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలోని పలు గ్రామాల్లోకి మిడతల దండు ప్రవేశించిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలో మిడతలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటి నియంత్రణకు హెలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో రసాయనాలు పిచికారీ చేయాలని ఆయా రాష్ర్టాలకు కేంద్రం ఇప్పటికే సూచించింది. ఎడారి మిడతలు మిడత జాతికి చెందినవి. నిండా కొమ్ములుండి తమ మార్గంలో ఏవీ కనిపించినా తినేస్తాయి. వీటి ద్వారా గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లి కోట్లాది మంది జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 


logo