బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 10:18:48

ఉత్తరాఖండ్‌లో చిరుత కలకలం

ఉత్తరాఖండ్‌లో చిరుత కలకలం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో చిరుత కలకలం రేపింది. నానిటాల్‌కు చెందిన చందన్ సింగ్ అధికారి అనే వ్యక్తి ఇంట్లోకి  చిరుత చొరబడింది. చిరుతను గమనించిన  పెంపుడు కుక్కలు మొరగడం ప్రారంభించాయి. దీంతో  చిరుత ఓ కుక్కపిల్లను నోటకరుచుకుని పారిపోయింది. ఇదంతా సీసీటీవీలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

చిరుత ఇంట్లోకి చొరబడడంతో చందన్ సింగ్ కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు.  గత 15 రోజుల్లో జనావాసాల్లో చిరుత ఇలా కలకలం రేపడంతో ఇది రెండో సారి అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo