ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 07, 2020 , 08:37:26

యూ-ట్యూబర్‌ వాసన్‌పై చీటింగ్‌ కేసు

యూ-ట్యూబర్‌ వాసన్‌పై చీటింగ్‌ కేసు

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ హోటల్‌ యజమాని కాంతా ప్రసాద్‌ (80)ను మోసగించిన కేసులో యూ-ట్యూబర్‌ గౌరవ్‌ వాసన్‌పై పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్‌లో ప్రసాద్‌ ఇబ్బందులను ఇటీవల వాసన్‌ తన యూ-ట్యూబ్‌ చానెల్‌ ద్వారా వెలుగులోకి తెల‌చ్చారు. దీంతో బాబా కా దాబాకు మంచి గుర్తింపువ‌చ్చింది. తన పేరిట దాతల నుంచి విరాళాలు కోరుతూ సోషల్‌ మీడియాలో వాసన్‌ పిలుపునిచ్చాడ‌ని, కానీ వచ్చిన విరాళాల్లో అధిక భాగం ఆయనే కాజేశాడని కాంతా ప్రసాద్‌ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వాస‌న్‌ను అదుపులోకితీసుకున్నారు. వివిధ సెక్ష‌న్ల కింద అత‌నిపై కేసు న‌మోదుచేశారు.