సోమవారం 30 మార్చి 2020
National - Mar 20, 2020 , 05:13:10

బీవోబీ డిజిటల్‌ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేత

బీవోబీ డిజిటల్‌ లావాదేవీలపై ఛార్జీలు ఎత్తివేత

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన ఆర్థిక సేవల సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా వైరస్‌ ఉదృతమవుతున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా వీటిపై విధిస్తున్న చార్జీలను మూడు నెలల పాటు ఎత్తివేస్తున్నట్లు తాజా గా ప్రకటించింది. ‘ స్టే సేఫ్‌..బ్యాంక్‌ సేఫ్‌' అనే నినాదంతో మరింత మంది బ్యాంక్‌ ఖాతాదారులను డిజిటల్‌ లావాదేవీల పరిధిలోకి తీసుకురావడానికి, మరోవైపు బ్రాంచ్‌కు రాకుండా నియంత్రించే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది. 


logo