Punjab New CM Charanjith S Channi | పంజాబ్ నూతన సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు పదవీ ప్రమాణం చేయనున్నారు. పంజాబ్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ హై కమాండ్ మధ్య ఎడతెగని చర్చలు జరిగిన తర్వాత ఏఐసీసీ చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును ఖరారు చేసింది. ఆ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ను చరణ్జిత్ సింగ్ చన్నీ, హరీశ్ రావత్ కోరారు.
నూతన సీఎంగా చరణ్జిత్ సింగ్ చన్నీ ఎన్నికవ్వడంతో ఆయన నివాసం వద్ద మద్దతుదారులు సంబురాలు చేసుకున్నారు. పంజాబ్ నూతన సీఎంగా ఎంపికైన చరణ్జిత్ సింగ్ చన్నీకి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.