సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 14:11:29

కరోనా ఎఫెక్ట్ : బీహార్ ఉపఎన్నికల మార్గదర్శకాల్లో మార్పులు

కరోనా ఎఫెక్ట్ : బీహార్ ఉపఎన్నికల మార్గదర్శకాల్లో మార్పులు

 ఢిల్లీ : కరోనా మహమ్మారి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, పోలింగ్ స్టేషన్లలో 65 ఏండ్లు పైబడిన ఓటర్లు , కోవిడ్ పాజిటివ్ ఓటర్లు , క్వారంటైన్ లో ఉన్న ఓటర్లు వారి ఓటు హక్కునువినియోగించుకోవడానికి  పోస్టల్ బ్యాలెట్ సదుపాయాలను విస్తరించాలని ఎలక్షన్ కమిషన్  సిఫారసు చేసింది. కమిషన్ చేసిన ఈ సిఫారసుపై,  న్యాయ మంత్రిత్వ శాఖ 19.06.2020 తేదీన సవరించిన నిబంధనలను ప్రకటించింది. అయితే, ఈ అధికార నిబంధనను అమలు చేయడానికి ముందు, ఎన్నికల సమయంలో, ప్రజల ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 60 (సి) కింద కమిషన్ తగిన నోటిఫికేషన్ జారీ చేస్తుంది.

ఈ అధికార నిబంధనలను అమలు చేయడానికి ముందు, కమిషన్ నిరంతరం క్షేత్ర పరిస్థితిని , కార్యాచరణ విధివిధానాలను నిరంతరంగా అంచనా వేస్తుంది. ఇటువంటి అసాధారణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బీహార్ లో రాబోయే శాసనసభ ఉప ఎన్నికల ప్రక్రియను కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుంది.  కోవిడ్-19 పరిస్థితులలో, ముఖ్యంగా వృద్ధులు , అనారోగ్యంగా ఉన్న ఓటర్లు సులువుగా ఓటు వేయడానికి వీలుగా, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఓటర్ల సంఖ్యను వెయ్యికి పరిమితం చేస్తూ, కమీషన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో, రాష్ట్రం అదనంగా సుమారు 34,000 పోలింగ్ కేంద్రాలను (45 శాతం ఎక్కువ) ఏర్పాటు చేస్తుంది. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,06,000 కు పెరుగుతుంది.  దీనివల్ల బీహార్ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వాహనాల అవసరాలతో సహా 1.8 లక్షల మంది పోలింగ్ సిబ్బందిని , ఇతర అదనపు వనరులను సమీకరించేందుకు అవసరమైన రవాణాకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ఇదొక్కటే కాకుండా  రాబోయే ఉప ఎన్నికలకు కూడా ఇటువంటి సవాళ్లనే ఎదుర్కోవలసి వస్తుంది.

ఈ అన్ని సమస్యలు, సవాళ్లు, అడ్డంకులను పరిగణలోకి తీసుకుని , ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1000 కి పరిమితం చేసే నిర్ణయం దృష్ట్యా, బీహార్ లో రాబోయే సాధారణ ఎన్నికలలో ,సమీప భవిష్యత్తులో జరగే ఉప ఎన్నికలలో 65 ఏండ్లు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని విస్తరించాలనే నోటిఫికేషన్ జారీ చేయకూడదని కమిషన్ నిర్ణయించింది.  అయితే, 80 ఏండ్లు  పైబడిన ఓటర్లు, దివ్యాంగులైన ఓటర్లు, అత్యవసర సేవల్లో నిమగ్నమైన ఓటర్లు , హోమ్ క్వారంటైన్ తోపాటు, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న పాజిటివ్ / అనుమానితులైన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈ ఎన్నికలలో విస్తరించనున్నట్లు ఎలక్షన్ కమీషన్ తెలిపింది.logo