గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 19:01:59

చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది: ఒమర్‌ అబ్దుల్లా

చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది: ఒమర్‌ అబ్దుల్లా

ఢిల్లీ : చ‌ంద్ర‌బాబు నాయుడు ప‌చ్చి అవ‌కాశ‌వాది అని జ‌మ్ముక‌శ్మీర్ మాజీ సీఎం, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేత ఒమ‌ర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీలో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడిపై నిప్ప‌లు చెరిగారు. త‌న తండ్రి ఫరూఖ్‌ అబ్దుల్లా సొంత ఎన్నిక‌లు వ‌దులుకుని చంద్రబాబు కోసం ఏపీకి ప్ర‌చారానికి వెళ్లారు. ఏపీలో వైఎస్‌ జగన్‌ క్లీన్‌ స్వీప్‌ చేస్తారని తెలిసినా త‌న తండ్రి ప్రచారం చేశార‌న్నారు. బాబు ఓడిపోతున్నారన్న విషయం ఆయ‌న‌కు తప్ప అందరికి తెలుసు అన్నారు. కాగా తాము హౌజ్ అరెస్ట్‌లో ఉంటే చంద్రబాబు క‌నీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మద్ధతుగా ఒక్క ప్రకటన చేయలేద‌న్నారు. ఆయ‌న ప‌చ్చి అవ‌కాశ‌వాది అని, న‌మ్మ‌ద‌గిన నేత కాద‌న్నారు. 

జ‌మ్ముక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనంత‌రం గ‌తేడాది ఆగ‌స్టు 5 నుంచి ఒమ‌ర్ అబ్దుల్లా గృహ నిర్భందంలో ఉన్నారు. ఆయ‌న తండ్రి, మాజీ సీఎం ఫ‌రూఖ్ అబ్దుల్లా సైతం నిర్బంధంలోనే ఉండి ఈ ఏడాది మార్చి 13న విడుద‌ల‌య్యారు. ప‌బ్లిక్ సేఫ్టీ చ‌ట్టం కింద గృహ నిర్బంధంలో ఉంచిన సంగ‌తి తెలిసిందే. 


logo