చండీగఢ్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు చండీగఢ్ పోలీసులు సమన్లు జారీ చేశారు. సల్మాన్ సోదరి అల్విరా, మరో ఆరుగురికీ ఈ సమన్లు పంపారు. ఈనెల 13న విచారణకు హాజరుకావాలన్నారు. నగల దుకాణాన్ని ప్రారంభిస్తే సహాకారం అందిస్తామని నమ్మించి సల్మాన్ సన్నిహితులు కొందరు తనను మోసం చేశారని చండీగఢ్‌కు చెందిన అరుణ్ గుప్తా అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ సమన్లు జారీ చేశామని పోలీసులు తెలిపారు.