శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 22:13:37

భళా చండీగఢ్‌ బాలికా!

భళా చండీగఢ్‌ బాలికా!

చండీగఢ్‌: చండీగఢ్‌ బాలిక స్కేటింగ్‌లో అద్భుతాలు చేస్తూ భళా అనిపించుకుంటున్నది. అతి చిన్నవయస్సులో అద్భుతమైన ఫీట్లు సాధించి ప్రశంసలు పొందుతున్నది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. చండీగఢ్‌కు చెందిన పన్నేండేళ్ల జాన్వి జిందాల్‌కు స్కేటింగ్‌ అంటే మక్కువ.  కాగా, ఇందులో విభిన్న తరహాలో ప్రయత్నించి, శభాష్‌ అనిపించుకుంది. స్కేటింగ్‌ చేస్తూ మెట్లపైకి గ్లైడ్‌ చేయడం, స్కేట్స్‌లో  భాంగ్రా నృత్యం చేసిన అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. ఇందుకుగానూ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 

జాన్వి 2019 లో జాతీయ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నది. స్కేట్స్ అనేది సమతుల్యతకు సంబంధించిన ఒక కళ. ఆమె తండ్రి యూట్యూబ్ ద్వారా ఆమెకు స్కేటింగ్ నేర్పించారు. ఇప్పుడు జాన్వి ఇందులో నిపుణురాలిగా తయారైంది. ఆమె ఎనిమిదేళ్ల వయసులో శిక్షణ ప్రారంభించింది. జాన్వికి పంజాబీ కొరియోగ్రాఫర్ శిక్షణ ఇచ్చాడు. తర్వాత ఆమె స్కేటింగ్ చేసేటప్పుడు డ్యాన్స్ నేర్చుకుంది. ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించడం గర్వకారణంగా ఉందని జాన్వి తెలిపింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo