సోమవారం 25 జనవరి 2021
National - Aug 26, 2020 , 14:16:41

ఏపీలో భారీగా గంజాయి, గుట్కా ప‌ట్టివేత‌

ఏపీలో భారీగా గంజాయి, గుట్కా ప‌ట్టివేత‌

అమ‌రావ‌తి: పోలీసులు ఎంత ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. గంజాయి లాంటి మ‌త్తు ప‌దార్థాల‌ను అక్ర‌మంగా ర‌వాణా చేసే ముఠాలు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త పోక‌డ‌ల‌ను అనుస‌రిస్తూ త‌మ దందా కొన‌సాగిస్తున్నారు. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లాలో నాలుగు కిలోల‌ గంజాయి, నిషేధిత గుట్కా ప‌ట్టుబ‌డింది. వాటిని ఇత‌ర రాష్ట్రాల నుంచి అక్ర‌మంగా రాష్ట్రంలోకి త‌ర‌లిస్తుండ‌గా కృష్ణా జిల్లా చంద‌ర్‌ల‌పాడు పోలీసులు వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకున్నారు. 

గంజాయి, నిషేధిత గుట్కా ప్యాకెట్‌ల‌తోపాటు భారీగా మ‌ద్యం సీసాల‌ను కూడా పోలీసులు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. న‌లుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి, గుట్కా విలువ సుమారుగా రూ.11 ల‌క్ష‌లు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.            

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo