గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 11, 2020 , 17:12:42

కరోనా దెబ్బతో 50 వేలకు చేరుకోనున్న బంగారం

కరోనా దెబ్బతో 50 వేలకు చేరుకోనున్న బంగారం

డాలరు బలహీనత, మార్కెట్ డిమాండ్ తగ్గిన కారణంగా ముంబైలో మంగళవారం బంగారం ధర రూ.401 తగ్గి రూ.44,014కు పడిపోయింది. గత ఐదునెలల కనిష్టానికి డిమాండ్ తగ్గడంతో డీలర్లు డిస్కౌంట్ ఇస్తుండడం వల్ల ఇలా జరిగింది. అయితే ఈ ధర తరుగుదల తాత్కాలికమేనని వ్యాపార సంఘాలవారు అంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుండడం, రూపాయి బలహీన పడడం వంటి కారణాలతో గుడిపాడ్వా లేదా అక్షయ తృతీయ నాటికి బంగారం మళ్లీ పుంజుకుని 50 వేల మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశం ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేయడం కరోనా కరాళ నాట్యానికి అద్దం పడుతున్నది. మరోవైపు మాంద్యం నీడలు విస్తరిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం లేదా కరోనా వంటి మహమ్మారి విజృంభించిన ప్రతిసారీ బంగారం వైపు చూడడం మదుపరులకు అలవాటేనని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి వస్తున్న సూచనలు కనిపించడం లేదు. మరోవైపు చమురు సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకున్నది. ఈ పరిస్థితుల్లో బంగారం ఒక్కటే నమ్మదగిన ప్రత్యామ్నాయంగా మదుపరులు భావించడం సహజమే.    


logo