శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 01:14:38

ఇద్దరు మహిళా జర్నలిస్టులకు చమేలిదేవి జైన్‌ అవార్డు

ఇద్దరు మహిళా జర్నలిస్టులకు చమేలిదేవి జైన్‌ అవార్డు

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన చమేలిదేవి జైన్‌ అవార్డుకు ఈ ఏడాది ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎంపికయ్యారు. ‘ద వైర్‌' వెబ్‌సైట్‌ జర్నలిస్టు అర్ఫాఖానుం షెర్వాని, బెంగళూరుకు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ రోహిణి మోహ న్‌ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. కశ్మీర్‌, ఉత్తరప్రదేశ్‌లో ఘర్షణాత్మక పరిస్థితుల్లోనూ రిపోర్టింగ్‌ చేసినందుకు షెర్వానిని, అసోంలో ఎన్నార్సీపై పరిశోధనాత్మక జర్నలిజానికిగాను రోహిణి మోహన్‌ను ఎంపికచేసినట్టు జ్యూరీ సభ్యులు తెలిపారు.


logo