ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 14:48:46

అన్నయ్యతో ఛాలెంజ్‌.. 23వ అంతస్తులో లెడ్జ్‌పై క్యాట్‌ వాక్‌ చేసిన బాలిక.. వీడియో వైరల్‌

అన్నయ్యతో ఛాలెంజ్‌.. 23వ అంతస్తులో లెడ్జ్‌పై క్యాట్‌ వాక్‌ చేసిన బాలిక.. వీడియో వైరల్‌

చెన్నై : సుదీర్ఘకాలం ఇంట్లో ఉండలేక చెన్నైకు చెందిన ఓ 14 ఏండ్ల బాలిక అన్నయ్యతో ప్రమాదకర గేమ్‌ ఆడింది. ఆమె తన సోదరుడి కంటే ధైర్యవంతురాలినని నిరూపించడానికి అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్ 23వ అంతస్తులో బయటి గోడ వెంట ఇరుకైన లెడ్జ్ మీద నడిచింది. మూడుసార్లు ఇలా ఆమె లెడ్జ్‌ మీద ప్రమాదకర స్థాయిలో నడుస్తుండగా పక్క అపార్ట్‌మెంట్‌లోని ఓ యువకుడు వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్టు చేయగా అది కాస్తా వైరల్‌ అయ్యింది. 

చెన్నై శివారు ప్రాంతమైన కేలంబక్కంలోని హిరానందాని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదకర స్టంట్‌ జరగ్గా తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏండ్ల బాలిక తన అన్నయ్యతో ఛాలెంజ్‌ చేసి ఈ స్టంట్‌ను ఆగస్టు 6న చేపట్టినట్లు తెలిసింది. 

ఆ తరువాత పోలీసులు భవనాన్ని గుర్తించి, విచారణ ప్రారంభించారు. మామల్లపురం ఏఎస్పీ సుందరవతనం అపార్ట్‌మెంట్‌ను సందర్శించి అన్నాచెల్లెళ్లిద్దరినీ మందలించారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా అపార్ట్‌మెంట్‌ లెడ్జ్‌ను మూసివేయాల్సిందిగా కాంప్లెక్స్‌ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయితే హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఘటన జరిగినట్లు చాలా మంది భావించగా.. చెన్నైలో జరిగిందని తరువాత తెలిసింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo