బుధవారం 03 జూన్ 2020
National - Mar 27, 2020 , 20:41:16

10 రోజుల త‌ర్వాత క‌రోనా లక్ష‌ణాలు..కానీ

10 రోజుల త‌ర్వాత క‌రోనా లక్ష‌ణాలు..కానీ

హ‌ర్యానా: చంఢీఘ‌డ్ లో తాజాగా క‌రోనా పాజిటివ్ కేసు ఒక‌టి న‌మోదైంది. బాధితుడు దుబాయ్ నుంచి వ‌చ్చిన 10 రోజుల త‌ర్వాత క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే స‌ద‌రు వ్య‌క్తి మాత్రం వెంట‌నే ఆస్ప‌త్రికి రాకుండా... 15 రోజుల త‌రువాత ఆస్ప‌త్రికి వ‌చ్చి రిపోర్టు చేశాడు. ప్ర‌స్తుతం ఆ వ్య‌క్తిని ఐసోలేష‌న్ వార్డులో ఉంచి చికిత్స కొన‌సాగిస్తున్న‌ట్లు చంఢీఘ‌డ్ ప్ర‌భుత్వ అధికారి మ‌నోజ్ పారిడా తెలిపారు.

హ‌ర్యానాలో ఇప్ప‌టివ‌ర‌కు 19 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.  క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇప్ప‌టికే హ‌ర్యానా ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మై క‌ర్ఫ్యూను విధించింది. ప్ర‌ధాని మోదీ పిలుపు మేర‌కు లాక్ డౌన్ ను అమ‌లు చేస్తూ ప్ర‌జ‌ల‌ను స్వీయ నిర్బంధంలో ఉండేలా చేస్తోంది. logo