గురువారం 02 జూలై 2020
National - Jun 15, 2020 , 18:45:59

ఢిల్లీలో కొవిడ్‌ నివారణకు చర్యలు: అమిత్‌ షా

ఢిల్లీలో కొవిడ్‌ నివారణకు చర్యలు: అమిత్‌ షా

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్‌ నివారణకు కేంద్ర సర్కారు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. కొవిడ్‌- 19 వ్యాప్తిపై చర్చించేందుకు ఢిల్లీలో అన్నిరాజకీయ పార్టీల నాయకులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో మనమంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరముందన్నారు.  అలాగే, ఇంటింటా సర్వే నిర్వహించడంతోపాటు పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆయన కేంద్ర, ఢిల్లీ సర్కారుతోపాటు మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లను ఆదేశించారు.  

 సంయుక్త సహకారంతో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించడమే ఈ సమావేశ ముఖ్య ఉద్దేశమని అమిత్‌షా పేర్కొన్నారు.  కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ఢిల్లీ  పోలీస్‌ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. logo