మంగళవారం 07 జూలై 2020
National - Jun 18, 2020 , 13:31:55

4 ల‌క్ష‌ల కోట్ల బాకీల‌పై వెన‌క్కి త‌గ్గిన కేంద్రం

4 ల‌క్ష‌ల కోట్ల  బాకీల‌పై వెన‌క్కి త‌గ్గిన కేంద్రం

హైద‌రాబాద్‌: టెలికామేత‌ర ప్ర‌భుత్వ రంగ సంస్థల నుంచి ఏజీఆర్ బాకీల కింద సుమారు నాలుగు ల‌క్ష‌ల కోట్లు వ‌సూల్ చేయాల‌నుకున్న నిర్ణ‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింది.  ఈ విష‌యాన్ని సుప్రీంకోర్టుకు ప్ర‌భుత్వం తెలియజేసింది.  నాలుగు ల‌క్ష‌ల కోట్ల ఏజీఆర్ బాకీల్లో 96 శాతాన్ని వ‌సూల్ చేసే ప్ర‌క్రియ‌ను ఉప‌సంహ‌రిస్తున్న‌ట్లు టెలికాం శాఖ కోర్టుకు తెలిపింది. గెయిల్ లాంటి సంస్థ నుంచి బాకీలు రాబ‌ట్టే నిర్ణ‌యాన్ని కూడా వెన‌క్కి తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.  జ‌స్టిస్ అరుణ్ మిశ్రా, ఎస్ అబ్దుల్ న‌జీర్‌, ఎంఆర్ షాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ సుప్రీంలో ఈ కేసు విచార‌ణ చేప‌ట్టడింది. 

ప్ర‌భుత్వం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా త‌మ వాద‌న‌ల‌ను వినిపించారు. పీఎస్‌యూల నుంచి ఏజీఆర్ బాకీల‌ను వ‌సూల్ చేసే అంశంలో టెలికాం శాఖ అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా సుప్రీం ధ‌ర్మాస‌నం కేసు విచార‌ణ చేప‌ట్టింది.  టెలికాం కంపెనీలైన భార‌తి ఎయిర్‌టెల్‌, వోడాఫోన్ ఐడియాలు.. సుప్రీంలో పిటిష‌న్ వేశాయి. ఆ కంపెనీల పిటిష‌న్‌కు టెలికాం శాఖ బ‌దులు ఇచ్చింది. ప్రైవేటు టెలీ కంపెనీల ఏజీఆర్ బాకీల‌పై గ్యారెంటీ ఏమిట‌ని ధ‌ర్మాస‌నం ఆయా కంపెనీల‌ను ప్ర‌శ్నించింది. logo