శనివారం 06 మార్చి 2021
National - Jan 20, 2021 , 20:51:40

18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత

18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత

ఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను మూడింటి అమలును 18 నెలల పాటు నిలిపివేయనున్నట్లు రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. అదేవిధంగా చట్టాలపై చర్చించేందుకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కమిటీ నివేదిక వచ్చేదాక చట్టాల అమలును నిరవధికంగా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్రానికి, రైతు సంఘాల నాయకుల మధ్య బుధవారం పదో విడత చర్చలు జరిగాయి. ఐదు గంటలపాటు రైతు నాయకులతో కేంద్రం సుదీర్ఘంగా చర్చించింది. చర్చల అనంతరం వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత ప్రతిపాదనలను రైతు నాయకుల ముందుంచింది. అయితే రైతు నాయకులు ఈ ప్రతిపాదనను వెంటనే అంగీకరించలేదు. అంతర్గత సంప్రదింపుల అనంతరం తమ అభిప్రాయం వెల్లడిస్తామని తెలిపారు. ఎల్లుండి మరోమారు చర్చలు జరుగనున్నాయి.

VIDEOS

logo