గురువారం 16 జూలై 2020
National - Jun 18, 2020 , 18:04:40

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌కు రూ.50వేల కోట్లు

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌కు రూ.50వేల కోట్లు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడి

న్యూ ఢిల్లీ: కరోనాతో పనిలేక సతమతమవుతున్న వలస కూలీలకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. 25 పథకాలను ఒకచోట చేర్చి గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌గా ప్రవేశపెట్టిన స్కీం ద్వారా ఉపాధి అందించేందుకుగానూ రూ.50వేల కోట్లు మళ్లిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వీటితో దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని వలస కూలీలకు కనీసం 125 రోజులు పని కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. 

 ‘మేం 25 పనుల కల్పనకు రూ.50వేల కోట్లు కేటాస్తున్నాం. కూలీలందరికీ పని లభిస్తుంది. దీంతో సంపద సృష్టి జరుగుతుంది. అలాగే, గ్రామీణాభివృద్ధి లక్ష్యం నెరవేరుతుంది’ అని ఆమె పేర్కొన్నారు. బీహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్తాన్‌లోని 116 జిల్లాల్లోని వలసకూలీలకు పని కల్పిస్తామని, కానీ వారి స్కిల్‌ను గుర్తించడమే పెద్ద పనిగా మారిందన్నారు. వారికి ఏరంగంలో అనుభవం ఉందో అదే పని కల్పిస్తామని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఆమె పేర్కొన్నారు.logo