సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 14, 2020 , 02:43:05

రైతు సంఘాలతో చర్చలు విఫలం

రైతు సంఘాలతో చర్చలు విఫలం

న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెలరోజులుగా ఆందోళన చేస్తున్న పంజాబ్‌ రైతులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయెల్‌ జరిపిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. విజ్ఞాన్‌ భవన్‌లో శుక్రవారం రోజంతా జరిగిన చర్చల్లో పలు అంశాలపై అభిప్రాయ బేధాలు వచ్చాయని చర్చల అనంతరం మంత్రి తోమర్‌ వెల్లడించారు. మరోసారి రైతు ప్రతినిధులతో చర్చలు జరుపుతామన్నారు. ఏఐకేఎస్‌సీసీ నేతృత్వంలో వివాదాస్పద కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26, 27 తేదీలో చలో ఢిల్లీ ఉద్యమానికి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దాంతో రైతుల డిమాండ్లను వినేందుకు కేంద్రమంత్రులు చర్చలు జరిపారు.