సోమవారం 08 మార్చి 2021
National - Jan 20, 2021 , 11:31:39

30న అఖిలపక్ష సమావేశం

30న అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో సమర్పించేముందు చర్చలు జరిపేందుకు ఈ నెల 30న మోదీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఉదయం 11.30గంటలకు ప్రారంభంకానున్న ప్రతిపాదిత సమావేశానికి ఉభయ సభల్లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులను కేంద్రం ఆహ్వానించింది. నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ పార్టీలు కూడా అదే రోజు సమావేశవుతాయని సమాచారం. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా అన్ని జాగ్రత్తల మధ్య పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రెండు దశల్లో జరుగనున్నాయి. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇదిలా ఉండగా.. అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ రాజ్యసభ నేత థావర్‌ చంద్‌ గెహ్లాట్‌, ఉప నేత పియూష్‌ గోయల్‌, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, మురళీధరన్‌ హాజరు కానున్నారు.  

VIDEOS

logo