బుధవారం 08 జూలై 2020
National - Jun 18, 2020 , 21:17:36

ర్యాపిడ్‌ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధం

 ర్యాపిడ్‌ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధం

న్యూఢిల్లీ : ఢిల్లీలో 6లక్షల ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి గురువారం తెలిపారు. ఇందుకోసం 500వలంటీర్లను 650 అంబులెన్స్‌లను ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం సమకూర్చనుందని పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నందున 169 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి కంటైన్‌మెంట్‌ జో్న్ల పరిధిలోని ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారన్నారు. ఈ పరీక్ష కేంద్రాల్లో ఫలితాలు కేవలం ౩౦నిమిషాల్లో తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. 169 కేంద్రాలకు త్వరలో 50వేల కిట్లు సమకూరుస్తామని, వీటిని దక్షిణ కొరియా నుంచి తెప్పించామని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వానికి ఇప్పటికే 7.32లక్షల ఎన్‌95 మాస్కులను సమకూర్చామని, 25లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు, 4.41లక్షల పర్సనల్‌ ప్రొటక్షన్‌ కిట్లు అందజేశామని పేర్కొన్నారు. 


logo