గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 17:27:14

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. వర్క్‌ ఫ్రం హోమ్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. వర్క్‌ ఫ్రం హోమ్‌

న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విధుల వేళల్లో కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి వర్గాల ఉద్యోగుల్లో సగం మంది కార్యాలయాలకు వచ్చి పని చేయాలని సూచించింది. ఇక ఇదే వర్గంలోని మిగతా 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయనున్నారు. 

అయితే ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించి, నిర్ణీత సమయాల్లో వచ్చి వెళ్లేలా నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని హెచ్‌వోడీలకు కేంద్రం సూచన చేసింది. ఈ పని వేళలు మార్చి 20వ తేదీ నుంచే వర్తించనున్నాయి. ఏప్రిల్‌ 4వ తేదీ వరకు ఈ పని వేళలు కొనసాగనున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు మూడు రకాల స్లాట్స్‌ను కేటాయించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు, ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు విధులు నిర్వహించనున్నారు. 

ఇక ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులు కచ్చితంగా టెలిఫోన్‌లో లేదా ఇతర మాధ్యమాల్లో అందుబాటులో ఉండాలని కేంద్రం ఆదేశించింది. అత్యవసర పరిస్థితుల్లో కార్యాలయానికి వచ్చేలా సిద్ధంగా ఉండాలని పేర్కొంది. వయసు పైబడిన ఉద్యోగులు, ఇప్పటికే మెడికల్‌ కండిషన్స్‌లో ఉన్న ఉద్యోగులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. 


logo
>>>>>>