సోమవారం 23 నవంబర్ 2020
National - Oct 31, 2020 , 16:13:04

2019-20లో ప్రకటనల కోసం కేంద్రం ఖర్చు రూ.713 కోట్లు

2019-20లో ప్రకటనల కోసం కేంద్రం ఖర్చు రూ.713 కోట్లు

ముంబై : 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్ మీడియాకు గరిష్ట వాటాతో భారత ప్రభుత్వం ప్రకటనల కోసం రూ.713.20 కోట్లు ఖర్చు చేసింది. ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త జతిన్‌ దేశాయ్‌ పెట్టుకున్న పిటిషన్‌కు సమాధానంగా కేంద్రం శనివారం వివరాలను వెల్లడించింది. అంటే రోజుకు దాదాపు రూ.1.95 కోట్లు అన్నమాట.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రకటనల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అని జతిన్‌ దేశాయ్ అనే కార్యకర్త ఆర్టీఐ కింద ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్, ప్రింట్, అవుట్‌డోర్ మీడియాలో ప్రకటనల కోసం కేంద్రం ఇప్పటివరకు మొత్తం రూ. 713.20 కోట్లు ఖర్చు చేసిందని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ (బీఓఆర్) వెల్లడించింది. దీనిలో ఎలక్ట్రానిక్‌ మీడియాకు విడుదల చేసిన రూ.317.05 కోట్లు, ప్రింట్‌ మీడియాకు రూ.295.05 కోట్లు, అవుట్‌డోర్‌ మీడియాకు రూ.101.10 కోట్లు ఉన్నాయి. అయితే విదేశీ మీడియాకు ఎంత ఖర్చు చేశారన్న ప్రశ్నకు మాత్రం తమ వద్ద సమాధానం లేదని స్పష్టం చేసింది. వేర్వేరు మాధ్యమాలలో ఏయే వర్గాల ప్రకటనలు విడుదలయ్యాయో స్పష్టంగా తెలియదని, ఈ ప్రచారం లేదా కేంద్రం, రాష్ట్రాల కోసం బ్లిట్జ్‌క్రెగ్ ద్వారా హైలైట్ చేసిన ప్రభుత్వ పథకాలకు ఈ పబ్లిసిటీ ఇచ్చారని తెలిపింది. మొత్తానికి ఇప్పటివరకు కేంద్రం తన ప్రభుత్వ కార్యక్రమాల ప్రకటనల కోసం రూ.713.20 కోట్లు ఖర్చు చేశారన్నమాట.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.