శనివారం 06 జూన్ 2020
National - May 11, 2020 , 17:00:25

కరోనా మహమ్మారి పేరిట రాజకీయాలొద్దు

కరోనా మహమ్మారి పేరిట రాజకీయాలొద్దు

న్యూఢిల్లీ: ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపై తన మార్క్‌ ఆగ్రహాన్నిచూపించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ అమలు, వలస కార్మికుల తరలింపు వంటి అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడారు. తన వంతు రాగానే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా ఫైరైపోయారు. పశ్చిమ బెంగాల్‌పై కేంద్రం  కక్షగట్టిందని విరుచుకుపడ్డారు.

కరోనా మహమ్మారి పేరుతో రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకొంటే బాగుంటుందని హితవుపలికారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. తమకు కేంద్రం రాస్తున్న ఉత్తరాలు లీక్‌ అవుతున్నాయి, దీని వెనుకున్న రాజకీయం  ఏంటో మీరే చెప్పాలి.. మా ప్రభుత్వం కేంద్రం నిబంధనలను అమలుపరచడం లేదంటూ మాపై నిందారోపణలు చేస్తున్నారు.. ఇది ఎంత మాత్రమూ మంచిది కాదన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తిని  కాంక్షిస్తూ అన్నిరాష్ట్రాలను సమానంగా చూడాలని ఆమె కేంద్రానికి సూచించారు.


logo