శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 07:50:13

కరోనాపై పోరుకు 14 రాష్ర్టాలకు రూ.6195 కోట్లు

కరోనాపై పోరుకు 14 రాష్ర్టాలకు రూ.6195 కోట్లు

న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు నిధుల కొరత లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 14 రాష్ర్టాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ లోటు పూడ్చుకోవడానికి రూ.6195 కోట్లు విడుదల చేసింది. నెలవారీ వాయిదాగా ఈ మొత్తాన్ని చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్‌ ట్విట్టర్‌ వెల్లడించారు. ఇందులో కేరళకు రూ.1,276.91 కోట్లు, పంజాబ్‌ రాష్ర్టానికి రూ.638 కోట్లు, పశ్చిమబెంగాల్‌కు రూ.417.75 కోట్లు విడుదల చేసింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌ రాష్ర్టాలు ఈ నిధులను అందుకోనున్నాయి.


logo