బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 17:16:29

ఎంఎస్‌పీ స్కీమ్‌.. 3 రాష్ట్రాల‌కు 19,900 కోట్లు రిలీజ్‌

ఎంఎస్‌పీ స్కీమ్‌..  3 రాష్ట్రాల‌కు 19,900 కోట్లు రిలీజ్‌

హైద‌రాబాద్‌: నేష‌న‌ల్ కోఆప‌రేటివ్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్(ఎన్‌సీడీసీ) ఖ‌రీఫ్ వ‌రి పంట సేక‌ర‌ణ కోసం మూడు రాష్ట్రాల‌కు 19,444 కోట్ల‌ను రిలీజ్ చేసింది. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర స్కీమ్ కింద ఈ మొత్తాన్ని విడుద‌ల చేశారు. చ‌త్త‌స్‌ఘ‌డ్‌, హ‌ర్యానా, తెలంగాణ రాష్ట్రాల‌కు తొలి ఇన్‌స్టాల్మెంట్‌ను విడుద‌ల చేసిన‌ట్లు కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది.  రాష్ట్రాలు, రాష్ట్ర మార్కెటింగ్ స‌మాఖ్య‌ల‌కు చేయూత‌నిచ్చేందుకు తొలి ద‌ఫా నిధుల‌ను రిలీజ్ చేసిన‌ట్లు వ్య‌వ‌సాయ‌శాఖ పేర్కొన్న‌ది.  ఎంఎస్‌పీ స్కీమ్ కింద చ‌త్తీస్‌ఘ‌డ్‌కు అత్య‌ధికంగా 9000 కోట్ల‌ను రిలీజ్ చేశారు. తెలంగాణ‌కు 5500 కోట్లు, హ‌ర్యానాకు 5,444 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు వ్య‌వ‌సాయ‌శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  కోవిడ్ మ‌హ‌మ్మారి వేళ ఎన్‌సీడీసీ తీసుకున్న చ‌ర్య‌లు రైతుల‌కు ఆర్థిక భ‌రోసాను ఇస్తున్నాయ‌ని మంత్రిత్వ‌శాఖ వెల్ల‌డించింది. ఈ మూడు రాష్ట్రాల నుంచే 75 శాతం వ‌రి పంట ఉత్ప‌త్తి అవుతున్న‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.  


logo