బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Feb 23, 2020 , 01:23:58

రైతులకు 50,850 కోట్లు

రైతులకు 50,850 కోట్లు
  • ‘పీఎం కిసాన్‌' పథకం కింద8.46 కోట్ల మందికి ఇచ్చాం
  • కేంద్ర వ్యవసాయశాఖ వెల్లడి

న్యూఢిల్లీ: ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయంగా ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన(పీఎం కిసాన్‌)లో భాగంగా శనివారంనాటికి రూ.50,850 కోట్లకు మించి పంపిణీ చేసినట్టు కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి 24న యూపీలోని గోరఖ్‌పూర్‌లో ప్రధాని మోదీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కానీ 2018 డిసెంబర్‌ నుంచే పెట్టుబడి పథకం అమల్లోకి వచ్చింది. ఐదెకరాల్లోపు రైతులందరినీ అర్హులుగా పరిగణించారు. ఈ నేపథ్యంలో ఏడాదికాలంలో సాధించిన ప్రగతి నివేదికను కేంద్ర వ్యవసాయశాఖ విడుదల చేసింది. ఒక్కో రైతుకు ఏడాదిలో మూడు దఫాలుగా రూ.ఆరు వేలు పెట్టుబడి సాయంగా నగదు బదిలీ చేయడమే ఈ పథకం లక్ష్యం. 2015-16 జనాభా లెక్కల ప్రకారం ఈ పథకంలోకి వచ్చే లబ్ధిదారుల సంఖ్య 14 కోట్లు కాగా, ఏడాది వ్యవవధిలో ఫిబ్రవరి 20నాటికి 8.46 కోట్ల మందికి ప్రయోజనం కలిగించినట్టు కేంద్రం తెలిపింది. 2019 డిసెంబర్‌1నాటికి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖతాలను పరిగణనలోకి తీసుకున్నారు. అసోం, మేఘాలయ, జమ్ముకశ్మీర్‌, లడఖ్‌కు మాత్రం ఈ ఏడాది మార్చి వరకు మినహాయింపు ఇచ్చారు.


logo